కార్తీక పౌర్ణమి పర్వదినం 19 నవంబర్ 2021, తమిళనాడు లోని అరుణాచలం మహా దీపోత్సవం సందర్భంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, నవమ పీఠాధిపతి సద్గురు డా. ఉమర్ ఆలీషా స్వామి దివ్య ఆశీస్సులతో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, పిఠాపురం సభ్యులు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివ సన్నిధి చారిటబుల్ ట్రస్ట్ యం.డి. శ్రీ దాట్ల సూర్య నారాయణ రాజు గారు, శ్రీమతి సాగి జ్యోతి కుమారి గారు పాల్గొన్నారు. సుమారు 10 వేల మంది కి అన్నదానం నిర్వహించారు. ఈ రోజు మహా దీపోత్సవం లో 50 లక్షల పైగా భక్తులు పాల్గొన్నారు.