At the Sri Parabhava Nama Samvatsara Ugadi meeting held at the Pithapuram main Ashram premises, the Peethadhipathi, Dr. Umar Alisha Sadguruvarulu, inaugurated a buttermilk distribution center (Chalivendram) established by the Umar Alisha Rural Development Trust. Additionally, through the Trust, Dr. Umar Alisha Sadguruvarulu presented a scholarship of 70,000 rupees to a student, a check for 32,500 rupees for 50 chairs for the Rajamahendravaram Ashram, a sewing machine to a poor woman, an idli-making vessel for women’s economic empowerment, and grain bunches as food for birds.
పిఠాపురం ప్రధాన ఆశ్రమ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సభలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు ప్రారంభించారు. అలాగే ట్రస్ట్ ద్వారా ఒక విద్యార్థికి 70 వేల రూపాయలు స్కాలర్ షిప్, రాజమహేంద్రవరం ఆశ్రమానికి 50 కుర్చీల నిమిత్తం 32, 500 రూ॥ చెక్కును, నిరుపేద మహిళకు కుట్టు మిషన్, మహిళా ఆర్థిక సాధికారత కోసం ఇడ్లీ పాత్ర, పక్షులకు ఆహారంగా ధాన్యపు కుచ్చులను పీఠాధిపతి డా॥ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు బహూకరించారు.




