
Pithapuram, 4-Jun-26:
The spiritual head, Dr. Umar Alisha Sadguruvarulu, delivered a blessing speech urging everyone to plant three saplings each and transform Pithapuram town into a ‘Nandana Vanam’ (a celestial garden). On the occasion of World Environment Day, Panduru mango saplings were planted within the premises of the Sri Viswa Viznana Vidya Adhyatmika Peetham and Pithapuram Housing Society.
The program was presided over by Dr. Umar Alisha, while Sri Sivaramakrishna, the Project Director of Pithapuram PADA, participated as the chief guest and planted saplings. Speaking on the occasion, Sri Sivaramakrishna Prasad stated that through the planting of trees, Dr. Umar Alisha Sadguruvarulu is not only working tirelessly to prevent environmental pollution but is also eradicating ’emotional and mental pollution’ in humans through the practice of knowledge (Jnana Sadhana) via the Peetham.
To promote natural farming within the society premises, Dr. Umar Alisha Sadguruvarulu, natural farming expert Smt. Dasari Naga Lakshmi, and PADA Project Director Sri Sivaramakrishna Prasad sowed organic seeds in the field
పిఠాపురం 4-6-26
ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటండి, పిఠాపురం పట్టణాన్ని నందన వనంగా మార్చండి అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అనుగ్రహ భాషణ చేసారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం హౌసింగ్ సొసైటీ ఆవరణలో పండూరు మామిడి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా అధ్యక్షత వహించగా, పిఠాపురం PADA ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ శివరామ కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్రీ శివరామ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మొక్కలు నాటడం ద్వారా డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు పర్యావరణ కాలుష్య నివారణకు అవిశ్రాంతంగా శ్రమించుటయే కాక, పీఠం ద్వారా మానవునిలోని భావ కాలుష్యాన్ని జ్ఞాన సాధన ద్వారా నిర్మూలిస్తున్నారని అన్నారు. సొసైటీ ఆవరణలో ప్రకృతి వ్యవసాయం చేయుటకు పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు, ప్రకృతి వ్యవసాయం నిపుణురాలు శ్రీమతి దాసరి నాగ లక్ష్మి, PADA ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ శివరామ కృష్ణ ప్రసాద్ పొలంలో ఆర్గానిక్ విత్తనాలు చల్లారు.


















