భారతీయ సంస్క్రతి ప్రతిబింబించే విధంగా, సనాతన ధర్మాన్ని తెలియ చేయు నవగ్రహ వనం, రాశి వనం, సప్త ఋషి వనం అనే మూడు వనాలు ఏర్పాటు చేసి, ఆయుష్షును, ఆరోగ్యాన్ని ప్రసాదించే మొక్కలు నాటామని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు అనుగ్రహభాషణ చేశారు. AP Bio Diversity వారి సాంకేతిక సహకారంతో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా డిసెంబర్ 02, 2021 గురువారం ఉదయం స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం నూతన ఆశ్రమంలో నవగ్రహ వనం, రాశి వనం, సప్త ఋషి వనం లో మొక్కలు నాటే కార్యక్రమానికి పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి అధ్యక్షత వహించగా, రిటైర్డ్ DFO శ్రీ జానకీరావు గారు, UARDT బయో డైవర్సిటి రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీమతి ముదునూరి సూర్యావతి గారు కార్యక్రమాన్ని నిర్వహించారు. పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు మాట్లాడుతూ వృక్షో రక్షతి రక్షితః అన్నారు. భవిష్యత్ లో ఎటువంటి ప్రమాదకరమైన వైరస్ లు, ప్రకృతి వైపరీత్యాలు విజృంభించకుండా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని పిలుపు నిచ్చారు. ఈనాటి మూడు వనాల ద్వారా ఆరోగ్యం అనే మహా ప్రసాదం లభించును అని అన్నారు. భవిష్యత్ లో ఇదొక తీర్ధా స్థలంగా పరిగణింప బడునని డా. ఉమర్ ఆలీషా అన్నారు. ఈ మూడు వనాల్లోను ఔషద గుణాలు గల మొక్కలు నాటుట జరిగింది. ఈ వనాల ద్వారా సృష్టిలో ఉన్న పంచభుతాల సమతుల్యత కాపాడబడి, సృష్టిలో ఉన్న జీవరాశి, వృక్ష రాశితో కూడిన జీవ వైవిధ్యాన్ని కాపడబడునని డా. ఉమర్ ఆలీషా అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఏ.వి.వి సత్యనారాయణ గారు, గుంటూరు A.P బయోడైవర్సిటి అధికారి శ్రీ జానకీ రావు గారు, కడియం నర్సరీ విజయ్, హార్టికల్చర్ విద్యార్థులు ఉమా, శివ, పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు గారు, పీఠం సెంట్రల్ కమిటీ, ట్రస్ట్ కమిటీ, జిల్లా కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. మూడు వనాల విశిష్టత ను తెలియ చేయు బ్రోచర్ ని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు ఆవిష్కరించి, వాటి ప్రతులను అతిథులకు అందచేశారు.
ఇట్లు,
శ్రీమతి ముదునూరి సూర్యావతి,
UARDT Bio Diversity State co-ordinator.
9121015669
నవగ్రహ, రాశి, సప్త ఋషి వనాల మొక్కలు నాటే కార్యక్రమం – Additional Photos