నా మొక్క… నా శ్వాస :- డా.ఉమర్ ఆలీషా
పర్యావరణహితంగా జీవించండి :- వీసీ ఆచార్య కె.పద్మరాజు
ఘనంగా నన్నయ నందనవనం ప్రోగ్రామ్
Press note.
ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదికవి నన్నయ యూనివర్సిటీలో నన్నయ నందనవనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం యూనివర్సిటీలో నన్నయ నందనవనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ డా.ఉమర్ ఆలీషా, వీసీ ఆచార్య కె.పద్మరాజు హాజరై విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. విశ్వవిద్యాలయ అధికారులు, ట్రస్ట్ సభ్యులు మొక్కలు నాటి వాటి పర్యావేక్షణ బాధ్యతలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో డా.ఉమర్ ఆలీషా మాట్లాడుతూ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో వీసీ ఆచార్య కె.పద్మరాజు ఆహ్వానం మేరకు మొక్కలు నాటి రెండు సంవత్సరాలలో నన్నయను నందనవనంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రస్తుత కాలుష్య ప్రపంచంలో మొక్కలు పెంచే ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. మొక్కలు ప్రాణాధారమైన ఆక్సిజన్ ను అందిస్తు జీవకోటికి మేలు చేస్తున్నాయని, మానవులు మొక్కలను నాటుతూ వాటిని పర్యావేక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. పర్యావరణ హితంగా జీవిస్తూ సేవ దృక్పదాన్ని అలవర్చుకోవాలన్నారు. నా మొక్క… నా శ్వాస నినాదంతో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాలలో విస్తారమైన మొక్కలు నాటామన్నారు. మేక్ వైజాగ్ గ్రీన్ పేరుతో హుదూద్ అనంతరం విశాఖపట్నంలో 2000 మొక్కలు నాటామన్నారు. వీసీ ఆచార్య కె.పద్మరాజు, ఆంధ్రవిశ్వవిద్యాలయం సేవదళ్ పేరుతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన ఆచార్య కె.వి.రావు ల ప్రోత్సాహం మరియు అందరి సహకారంతో నన్నయ నందనవనం విజయవంతం అవుతుందన్నారు. వీసీ ఆచార్య కె.పద్మరాజు మాట్లాడుతూ నా మొక్క.. నా శ్వాస పేరుతో గురువర్యులు డా. ఉమ్మర్ ఆలీషా చేస్తున్న మొక్కలు నాటే కార్యక్రమాలు, ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవాకార్యక్రమాలు ప్రశంసానియమన్నారు. విశ్వవిద్యాలయంలో ఐదు వందల మొక్కలను నాటి, రెండు సంవత్సరాల పాటు వాటిని పర్యావేక్షించే బాధ్యతను ట్రస్ట్ వారు చేపట్టారన్నారు. దీనిలో భాగంగా శుక్రవారం విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు 120 మొక్కలను నాటామని చెప్పారు. మామిడి, ఉసిరి, నేరేడు, జామ వంటి ఆదాయానిచ్చే పండ్ల మొక్కలను జియో ట్యాగ్ కు అనుసంధానం చేస్తు పెంచడం జరుగుతుందన్నారు. విశ్వవిద్యాలయంలోని ప్రతీ సిబ్బంది ఒక్కక మొక్కను నాటి వారు నాటిన మొక్కకు వారే బాధ్యత వహించే విధంగా పర్యావేక్షిస్తుండాలన్నారు. నన్నయ విశ్వవిద్యాలయాన్ని అందమైన, ఆహ్లాదకరమైన నందనవనంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులంతా పర్యావరణ హితంగా జీవించాలన్నారు. చక్కని వాతావరణంలో విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు గురువులు అందించాలని వీసీ సూచించారు. అనంతరం విశ్వవిద్యాలయ తరుపున డా.ఉమర్ ఆలీషా ను సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య టి.అశోక్, అధికారులు ఆచార్య కె.వి.రావు, ఆచార్య కె.శ్రీరమేష్, ఆచార్య.వై.శ్రీనివాసరావు, ఆచార్య డి.జ్యోతిర్మయి, డా.కె.రమణేశ్వరి, డా.పి.విజయనిర్మల, డా.పి.వెంకటేశ్వరరావు, డా.బి.జగన్మోహనరెడ్డి, డా.ఎ.మట్టారెడ్డి, డా.కె.సుబ్బారావు, డా.కె.వి.ఎన్.డి.వరప్రసాద్, డా.బి.రామ్ గోపాల్, ఎస్.లింగారెడ్డి, ఎన్.నాగేంద్రరావు మరియు ట్రస్ట్ సభ్యులు డా.పి.ఆనంద్ కుమార్, ఎన్.టి.వి.ప్రసాద్ వర్మ, పి.సూరిబాబు, ఎ.వి.వి.సత్యనారాయణ, సిహెచ్. వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
పేరూరి సూరిబాబు,
పీఠం కన్వీనర్,
9848921799.
News Channel
News Paper Clippings