నా మొక్క – నా శ్వాస – మేక్ పిఠాపురం గ్రీన్ – UARDT – 14 June 2024

నా మొక్క నా శ్వాస……
13-6-2024 పిఠాపురంలో పర్యావరణ పరిరక్షణ కొరకు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సద్గురువర్యులు మాట్లాడుతూ నా మొక్క నా శ్వాస అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరు తమ ఇళ్ళ దగ్గర మొక్కలను నాటి తద్వారా వచ్చిన ఫలపుష్పాలను భగవంతుని సన్నిధానంలో సమర్పించుకొని ఆ ప్రసాదమును స్వీకరించుట ద్వారా భగవంతుని కృప మనపై ప్రసరింపబడుతుంది. ఆ మొక్కల ద్వారా ఆక్సిజను మనకు లభిస్తుంది, భూ వాతావరణం చల్లబడుతుంది. తద్వారా అనేక రకాలైన అనారోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. ఉభయ రాష్ట్రాలలో ఈ ట్రస్ట్ ద్వారా అనేక ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు నిర్వహింపబడుచున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు నా మొక్క నా శ్వాస అనే భావంతో ఈ యజ్ఞంలో భాగస్వామ్యం కావాలని కోరుచున్నానని అన్నారు.

ఈ కార్యక్రమంలో అహమ్మదలీషా, మహబూబ్పాషా, హుస్సేనషా, కబీర్షా, ఆర్.కె.శివరామకృష్ణన్, రేకా. ప్రకాష్, సానబోయిన కృష్ణకుమార్, మరియు పీఠం సభ్యులు పాల్గొని కార్యక్రమమును జయప్రదంగా నిర్వహించారు.

Back To Top