ది. 16-6-2024 తేదీన ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చేపట్టే సామాజిక కార్యక్రమాలలో భాగంగా బల్లిపాడు గ్రామమును దత్తత తీసుకున్న డా౹౹ దండు పద్మావతి గారి సౌజన్యముతో స్త్రీ శిశుసంక్షేమం కార్యక్రమాన్ని పురస్కరించుకుని కుట్టుశిక్షణలో 30మంది స్త్రీలకు మొదటి బ్యాచ్ నందు శిక్షణ పూర్తికాగా 2వ బ్యాచ్ కి శిక్షణ ఇవ్వటానికి ముందుగా శిక్షణ తీసుకునేవారికి అవగాహన సదస్సు బల్లిపాడు ఆశ్రమ శాఖ భవనము నందు Dr. పద్మావతి గారిచే నిర్వహించబడినది.
ఈ సందర్భముగా ఆశ్రమ శాఖ వద్ద మొక్కలు నాటడమైనది.
ది.23-6-2024 తేదీన శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, నవమ పీఠాధిపతి డా౹౹ ఉమర్ ఆలీషా సద్గురువర్యులచే 2వ కుట్టు
శిక్షణా సిబిరము ప్రారంభించబడును.
ఆ కార్యక్రమ నిర్వహణ కొరకు తగిన ఏర్పాట్లు చేసుకోవటానికి, ఆశ్రమ శాఖ కమిటీ సభ్యులు, మరియు ఉమ్మడి ప.గో.జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా కన్వీనర్ A. N. వెంకటరత్నం సమావేశమై, కార్యక్రమం విజయవంతం కావటానికి తగిన నిర్ణయాలు తీసుకోవటమైనది.










