ఉమర్ ఆలీషా రూరల్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, (పిఠాపురం) హైదరాబాద్ శాఖ ఆధ్వర్యవంలో 16-6-2024న పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెక్లెస్ రోడ్డులో గల సంజీవయ్య పార్క్ వద్ద 5కె రన్ నిర్వహించడం జరిగింది. ఈ 5కె రన్ ను ట్రస్ట్ ఛైర్మన్ డా. ఉమర్ ఆలీషా స్వామివారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500మంది చిన్నపిల్లలు, యువత, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ ఛైర్మన్ డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు మాట్లాడుతూ ఈ 5కె రన్ ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం మరియు మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం అనే అంశాలపై ప్రజలలో అవగాహన కల్పించడం జరిగింది అన్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను, కాలుష్యాన్ని అరికట్టడానికి మొక్కలు నాటడము ఒక్కటే ప్రత్యామ్నాయమని, మనము ఆరోగ్యముగా ఉంటే అన్ని కార్యక్రమాలను సక్రమంగా, ఆనందంగా చేసుకోగలమని, ప్రతి ఒక్కరూ సంవత్సరానికి మూడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రతీ రోజు కొంత సమయాన్ని ధ్యానము, ఆధ్యాత్మిక చింతనకు కేటాయిస్తూ, శారీరక ఆరోగ్యానికి వ్యాయామం చేస్తూ, మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకుంటూ పర్యావరణాన్ని కాపాడటానికి కృషి చేస్తే మానవ మనుగడ సుఖవంతమవుతుంది అని అన్నారు.
ప్రోగ్రామ్ కన్వీనర్ కె. సూర్యలత మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ప్రజలలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగిస్తూ 5కె రన్ నిర్వహిస్తున్నామని ఉభయ తెలుగు రాష్ట్రాలలో 2 లక్షలకు పైగా మొక్కలు నాటడం జరిగిందని అని అన్నారు.
ఈ సందర్భంగా అక్కడకు వచ్చినటువంటి ప్రజలకు ఉచితంగా మొక్కలు, విత్తనం బంతులను పంపిణీ చేసారు. చిన్నారులు నృత్యప్రదర్శన, నుక్కడ్ నాటక్ మరియు చిన్నారులచే ప్రసంగాల ద్వారా పరివరణాన్ని పరిరక్షించాలి అని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా 5కె రన్లో విజేతలకు బహుమతులు, పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంసాపత్రము, మెడలు బహుకరించడం జరిగింది.

















