5-12-18 న బుధవారం ఉదయం సంకవరం మండలం కొంతంగి కొత్తూరు మండల ప్రజాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల లో పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి, స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ కె.వీ.కె ఉమామహేశ్వరరావు గార్లు పాఠశాల ఆవరణలో మొక్క నాటిన అనంతరం స్వామి ప్రసంగించారు. అనంతరం స్కూల్ పి.ఈ.టి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు స్వామి వారిని ఆనంద పర్చినవి. అనంతరం స్వామి వారిని స్కూల్ హెడ్ మాస్టర్ గారు మరియు స్కూల్ సిబ్భంది సన్మానించారు.