Press Note
ఆరోగ్య ప్రదాయిని నక్షత్ర వనం అని కాకినాడ జిల్లా అటవీశాఖాధికారి శ్రీ R. శ్రీనివాసరావు గారు అన్నారు. గురువారం ఉదయం పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఉమర్ ఆలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు AP Bio Diversity సంయుక్త అధ్వర్యంలో ఏర్పాటు చేసిన నక్షత్ర వనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా గారి సోదరుడు అహ్మద్ ఆలిషా అధ్యక్షత వహించగా,DFO శ్రీ R శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగాను, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీమతి ముదునూరి సూర్యా వతి, Dy Range officer శ్రీ A. సూరిబాబు, ఉమర్ అలీషా పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీ హుస్సేన్ షా,శ్రీ మృత్యుంజయ రావు, నేషనల్ గ్రీన్ core coordinator శ్రీ కేసరి శ్రీనివాస రావు, శ్రీ NTV ప్రసాద వర్మ, పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు కార్యక్రమంలో పాల్గొని వారి వారి నక్షత్రాల ప్రకారం ప్రత్యేక ఔషద గుణాలు గల మొక్కలు నాటడం జరిగింది. అహ్మద్ అలీషా గారు మాట్లాడుతూ నా మొక్క నా శ్వాస కార్యక్రమం ద్వారా పీఠాధితులు డా. ఉమర్ అలీషా స్వామి వారి అధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో వేలాది మొక్కలు నాటారని అన్నారు. ఈ రోజున ప్రత్యేక ఔషద గుణాలు గల మొక్కలు నక్షత్ర వనం లో నాటామని అన్నారు.
పీఠాధిపతి డా ఉమర్ అలీషా స్వామి లక్ష్యం ప్రకారం నూతన ఆశ్రమంలో ప్రవేశించిన ప్రతీ ఒక్కరూ ఔషద మొక్కల మీదనుండి వీచే గాలి ద్వారా సభ్యులకు ఆరోగ్యం చేకూరేలా అనేక వనాలు ఏర్పాటు చేసి ఔషద గుణాలు గల మొక్కలు వృద్ధి చేస్తున్నామని ఆన్లైన్ సందేశం తెలియ చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పక్షులకు వరి కుచ్చిలను కూడా DFO గారు Ahmed Alisha చేతుల మీదుగా సూర్య వతి గార్కి వరి కుచ్చు అందచేశారు.
ఇట్లు
శ్రీమతి ముదునూరు సూర్యా వతి,
ప్రోగ్రాం కోఆర్డినేటర్.
పిఠాపురం.
Print Media coverage
Electronic Media coverage