Free Cooling Water Plant opened in Pithapuram | 8th March 2024

ప్రెస్ నోట్. పిఠాపురం 8-3-24
ప్రజల దాహార్తిని తీర్చుటకు పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి కూలింగ్ వాటర్ ప్లాంట్ ను ఆవిష్కరించారు. అజీజా జెహరమ్మ సేవా సంస్థ పిఠాపురం వారి అధ్వర్యంలో ఉమర్ ఆలీషా రోడ్డు లో గల పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారి గృహం జంక్షన్ లో కీ . శే.శ్రీమతి కొల్లు రాజేశ్వరమ్మ సూర్య అప్పారావు పుణ్య దంపతులు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఏర్పాటు చేసిన శీతలీకరణ మంచి నీటి యంత్రాన్ని పీఠాధిపతి దా. ఉమర్ ఆలీషా స్వామి వారి అమృత హస్తాలతో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి సోదరులు అహ్మద్ ఆలీషా, హుస్సేన్ షా, కలీల్ షా తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్ లో నీటి యుద్ధాలు జరగకుండా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ నీటిని పొదుపుగా వాడాలని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు, కమిటీ సభ్యులు శ్రీ రేఖా ప్రకాష్, శ్రీ YNVKS సత్యనారాయణ, శ్రీ పుల్లా కల్కి మూర్తి, శ్రీ రేఖా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
పెరూరి సూరిబాబు,
కన్వీనర్.

Back To Top