COVID-19 – On 07-April-2020, UARDT Chairman Dr. Umar Alisha garu donated Three Lakh Rupees to the PM Relief Fund and Andhra Pradesh and Telangana Chief Minister’s Relief Fund

కరోనా నియంత్రణకు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సేవా కార్యక్రమములు

కరోనా నియంత్రణకు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఉభయ తెలుగు రాష్ట్రాలలోను మరియు ఇతర రాష్ట్రములలో పలు కార్యక్రమములు నిర్వహిస్తున్నామని ట్రస్ట్ చైర్మన్ డా. ఉమర్ ఆలీషా అన్నారు. దానిలో భాగముగా, ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి ఒక లక్ష రూపాయలు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక లక్ష రూపాయలు, మరియు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక లక్ష రూపాయలు మొత్తము మూడు లక్షల రూపాయలు విరాళముగా ఇచ్చినట్లు తెలియజేసారు .

ట్రస్ట్ వాలంటీర్లు సహకారముతో పన్నెండు లక్షల మందికి పైగా కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియో మందులు పంపిణి చేసి , వ్యాధి పట్ల అవగాహన కల్పించడము జరిగిందన్నారు . రానున్న రోజులలో ఇంకా విస్తృతముగా ఉచిత మందుల పంపిణి మరియు వ్యాధిపట్ల అవగాహన పెంపొందించే కార్యక్రమాలను చేస్తున్నట్టు తెలియజేసారు.

కుట్టు లో అనుభవము ఉన్న ట్రస్ట్ వాలంటీర్స్ మరియు ట్రస్ట్ తరుఫున కుట్టులో శిక్షణ పొందిన వారిద్వారా మాస్కులు తయారు చేయించి, ఆ తయారైన మాస్కులను ఆయా ప్రాంతాలలో గల వైద్య, పోలీస్, రెవిన్యూ మరియు పారిశుధ్య కార్మికులకు పంపిణి చేయుచున్నామని అన్నారు. ఇప్పటి వరకు పదివేల మాస్కులను పంపిణి చేసినట్లు తెలిపారు.

“స్వీయ నిర్బంధం శిక్ష కాదు , అదే మనకు రక్ష” అని , ప్రతి ఒక్కరు మన ప్రభుత్వము వారు ఇచ్చిన సూచనలు పాటిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ, లాక్ డౌన్ పూర్తి అయ్యే వరకు ప్రతి ఒక్కరూ ఇంటిలోనే ఉండి వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ పరిసరాలను శుభ్రముగా ఉంచుకుంటూ, కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలని, వారు ప్రజలని కోరారు.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చిన ఒక లక్ష రూపాయలు చెక్ ను వ్యవసాయ మరియు సహకార శాఖా మంత్రివర్యులు శ్రీ కురసాల కన్నబాబు గారికి అందచేశారు.

 

Back To Top