ప్రెస్ నోట్. కాకినాడ 26-4-24
పంచ భుతాలలో ఒక్కటైనా నీటిని పరిరక్షించు కోవాలని, భవిష్యత్ లో నీటి కోసం యుద్దాలు జరగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి పిలుపు నిచ్చారు. 26-4-24 శుక్రవారం ఉదయం కాకినాడ బోటు క్లబ్ వద్ద గల కవి శేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి విగ్రహ ప్రాంగణం లో ఏర్పాటు చేసిన పక్ష్షుల చలి వేంద్రం, మజ్జిగ చలి వేంద్రం, పశువుల చలి వేంద్రాలని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారి అమృత హస్తాలతో ఆవిష్కరించారు. పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి వారు మాట్లాడుతూ ఆధునిక యాంత్రిక ప్రపంచంలో జీవ వైవిధ్యాన్ని కాపాడాలని పిలుపు నిచ్చారు. మానవాళికి ఈ మండు వేసవిలో మంచినీరు, మజ్జిగ చలివేంద్రాలతో పాటు, నోరులేని పక్షులకు, పశువులకు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక చలి వేంద్రాలను ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి నృపికా అధ్యక్షుడు శ్రీ P. సుబ్రహ్మణ్యo గారు, JNTU ప్రొఫెసర్ డా. మురళీ కృష్ణ గారు, Rtd RTO శ్రీ రామచంద్రరావు గారు, రిటైర్డు పెన్షనర్స్ అసోసియేషన్ శ్రీ పద్మనాభo గారు, ముఖ్య అతిధులుగా వచ్చి ప్రసంగించారు. శ్రీ పాలడుగు సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న డా. ఉమర్ ఆలీషా స్వామి వారి సేవలను అభినందించారు. సీనియర్ జర్నలిస్టు శ్రీ మధుసూదనరావు గారు మాట్లాడుతూ ఉమర్ ఆలీషా గార్ని దయా స్వరూపులుగా, దైవ స్వరూపంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు, పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు శ్రీ AVV సత్యనారాయణ, పీఠం కమిటీ సభ్యులు శ్రీ సలాది రమేష్, శ్రీమతి మండా ఎల్లమాంబ, శ్రీమతి కాకినాడ లక్ష్మి, శ్రీ పేరూరి బాబ్జీ శ్రీమతి అన్నపూర్ణ, శ్రీ K.వీరభద్రరావు, శ్రీమతి అమ్మాజీ దంపతులు, శ్రీ మరిసే నాగేశ్వర రావు శ్రీమతి అమ్మాజీ దంపతులు, శ్రీ చిర్ల వెంకట రెడ్డి, షేక్ అమీర్ భాషా తదితరులు పాల్గొన్నారు. పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు అతిధులకు,కార్యకర్తలకు, సభ్యులకు,బాటసారులకు మజ్జిగ పంపిణీ చేసారు. పశువుల చలివేంద్రం వద్దకు వచ్చిన అవుకు స్వామి వారు ఆహారం, నీరు అందచేశారు.
ఇట్లు
పేరూరి సూరిబాబు,
కన్వీనర్,
9848921799