ది 27 మే 2021 గురువారం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు ఆదేశాలు మేరకు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వల్లూరి పల్లి గ్రామంలోను మరియు దర్శిపర్రు ఆశ్రమ ఆవరణలోను కోవిద్-19 నిబంధనలు అనుసరించి పక్షుల చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కావలిసిన వనరులను పీఠం సభ్యులు శ్రీ దంగేటి రామకృష్ణ గారు, శ్రీ కట్రెడ్డి షాబాబు గారు సమకూర్చారు. కార్యక్రమంలో పీఠం జిల్లా కమిటీ సభ్యులు శ్రీ గోపరాజు సాయిబాబా గారు పీఠం సభ్యులు శ్రీ పుల్లా బాబి గారు మరియు శ్రీ పుల్లా ఉమేష్ గారు తదితరులు పాల్గొన్నారు.