శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠచార్యులు సద్గురువర్యులు శ్రీ డా. ఉమర్ అలీషా గారి ఆదేశాలనుసారం ఉమర్ ఆలీషా రూరల్ డేవలెప్మెంట్ ట్రస్ట్ తరుపున ఈ రోజున అనగా ది. 10-05-2020 పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెంలో పక్షుల చలివేంద్రాన్ని గారపాటి గోపాలరావు గారి ఇంటి వద్ద ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో సబ్ ట్రెజరీ అధికారి గారపాటి గోపాలరావు గారు మాట్లాడుతూ ఉమర్ ఆలీషా రూరల్ డెవెలప్మెంట్ ట్రస్ట్ తరుపున అనేక సామాజిక కార్యక్రమాలు చెయ్యటం జరుగుతుంది. స్వామి చెప్పిన దాని ప్రకారం ఈ సంస్థకు ఆధ్యాత్మిక విద్యను చిన్నతనం నుండి అందరికి నేర్పించడం మరియు సామాజిక స్పృహను ప్రజలలో కల్పించడం అనేవి రెండు కళ్ళుగా ఏర్పాటు చేయటం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున పక్షుల చలివేంద్రాన్ని మూగ జీవుల యొక్క దాహార్తిని తీర్చడానికి ఏర్పాటు చేయటం జరిగింది. అంతే కాకుండా ఈ పీఠం ప్రజలలో సామాజిక స్పృహని కల్గించడానికి నామొక్క నాశ్వాస అనే నినాదంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి ఈ సంవత్సరం 900 మొక్కలు నాటడం జరిగింది. కరోన వ్యాధి (కోవిడ్ 19) నిరోధక హోమియోపతి మందులను తాడేపల్లిగూడెం పరిధిలో 50000 (ప్రజలకు మరియు సభ్యులకు) మందికి పంపిణీ చేయటం జరిగింది. వేసవి కాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయటం, ప్రకృతి వైపరీత్యాలు వలన ఆర్ధికంగా ఇబ్బంది పడేవారికి ఆర్ధిక సహాయం అందించడం, కుట్టుమిషన్లు పంపిణీ చేయటం, అంగన్ వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసి మహిళలకు స్వయం సమృద్ధి కార్యక్రమాలు మరియు నిరక్షరాస్యులను అక్షరాస్యులగా చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పీఠం సభ్యులు గారపాటి భువనేశ్వరి, కట్రెడ్డి షాబాబు, దంగేటి రామకృష్ణ, బోండపల్లి శ్రీనివాసు, తంగేళ్ల త్రిమూర్తులు, అనేకమంది పిల్లలు పాల్గొనటం జరిగింది. అంతే కాకుండా ఈ పక్షుల చలివేంద్రాలు తాడేపల్లిగూడెం ట్రెజరీ కార్యాలయము వద్ద, తాడేపల్లిగూడెం ఆశ్రమం వద్ద ఏర్పాటు చేయటం జరిగింది అన్నారు.
కాంటాక్ట్ నంబర్స్ :
1. కట్రెడ్డి షాబాబు – 7893074215
2. దంగెటి రామకృష్ణ – 9963414268
ఇట్లు
గారపాటి గోపాలరావు
ఉప ఖజానా అధికారి
తాడేపల్లిగూడెం