Plant Trees, Protect Health – Message from Peethadhipathi Dr. Umar Alisha | 24 July 2025 | Pithapuram

Plant trees and maintain health, said the head of the Peetham and chairman of UARDT, Dr. Umar Alisha, in his congratulatory speech…Dr. Umar Alisha said that if human life is to be happy, everyone should plant 3 trees and turn the town of Pithapuram into a beautiful forest.

On Thursday morning, in the Pithapuram District Court premises, the Chairman of the Trust, Dr. Umar Alisha, participated as the chief guest and addressed the "My Plant, My Breath" program organized by the Umar Alisha Rural Development Trust.

He called on everyone to plant 3 saplings to make the grand event of Make Pithapuram Green a success and thereby protect our health.

12th Additional District Judge Sri K. Srihari said that we can protect the environment by planting trees and it is a pleasure to have Umar Alisha Rural Development Trust participate in this great program.

In this program, 12th Additional District Judge Sri K. Srihari, Senior Civil Judge Sri M. Babu, Principal Junior Civil Judge Kumari Vijaya Rameshwari, Bar Association President Sri M. Raja Rao, Additional Public Prosecutor Sri B.L. Dora, Mana Ooru Mana Bharya Sanstha President Sri Kondepudi Shankara Rao, Municipal Floor Leader Sri Allavarapu Nagesh, several advocates and Peetham Convener Sri Peruri Suribabu, Central Committee Member Sri A.V.V. Satyanarayana and others participated. Trust activists planted about 90 saplings in the Pithapuram court premises.

మొక్కలు నాటండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేశారు…
“మొక్కలు నాటండి – ఆరోగ్యాన్ని కాపాడుకోండి” అని పీఠాధిపతులు డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అనుగ్రహ భాషణ చేశారు. మానవ జీవన మనుగడ సుఖమయం కావాలంటే ప్రతీ ఒక్కరూ 3 మొక్కలు నాటి పిఠాపురం పట్టణమును నందన వనంగా తీర్చిదిద్దాలని అన్నారు.

పిఠాపురం జిల్లా కోర్టు ఆవరణలో తే. 24-07-25 గురువారం ఉదయం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యవంలో “నా మొక్క నా శ్వాస” కార్యక్రమంలో ట్రస్ట్ ఛైర్మన్ పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రతీ ఒక్కరూ 3 మొక్కలు నాటి “మేక్ పిఠాపురం గ్రీన్” అనే మహోన్నత కార్యక్రమం విజయవంతం చేయాలని, తద్ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోగలమని, ఈ మహత్తర కార్యక్రమానికి ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ భాగం పంచుకోవడం ఆనందదాయకం అని 12వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీ కే. శ్రీహరి అన్నారు. ఈ కార్యక్రమంలో 12వ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీ కే. శ్రీహరి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీ ఎం.బాబు, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి కుమారి విజయ రామేశ్వరి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఎం. రాజారావు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ బి.ఎల్. దొర, మన ఊరు మన బాధ్యత సంస్థ అధ్యక్షుడు శ్రీ కొండేపూడి శంకరరావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీ అల్లవరపు నగేష్, పలువురు అడ్వకేట్స్ మరియు పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు, సెంట్రల్ కమిటీ సభ్యులు శ్రీ ఎ.వి.వి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ట్రస్ట్ కార్యకర్తలు సుమారు 90 మొక్కలు పిఠాపురం కోర్టు ఆవరణలో నాటారు.

Back To Top