మానవ సేవయే మాధవ సేవగా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, పిఠాపురం ద్వారా పీఠాధిపతి డా ఉమర్ అలీషా స్వామి అధ్యక్షతన ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కె తిమ్మాపురం లో బండే రామ కృష్ణ, లోవ కనక దుర్గ దంపతుల పూరిల్లు అగ్నికి ఆహుతై సర్వస్వం కోల్పోయారు. ట్రస్ట్ ద్వారా 13,000 నగదు, 50 కేజీ ల బియ్యం, పంచదార, కందిపప్పు ఇతర కిరాణా సామాగ్రిని నిరుపేద మహిళ శ్రీమతి బండే లోవ కనక దుర్గ కు ట్రస్ట్ సభ్యులు అంద చేశారు. ఈ కార్యక్రమంలో సహకరించిన వారు శ్రీ డి. సూర్య కుమార్, ఎస్ రామ్ కుమార్, శివ ప్రసాద్, ఎస్. వేంకటేశ్వర రావు, కె ఉమేష్, ఎస్. వెంకట రెడ్డి, ఎస్. కృష్ణా రావు, రేఖా ప్రకాష్, ఎస్. కృష్ణ కుమార్, ఎస్. వెంకట లక్ష్మీ, శ్రీ పేరూరి సూరిబాబు తదితరులు.
If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.
For more details please visit http://www.uardt.org/coronavirus/