ఓం శ్రీ సద్గురుభ్యోనమః
శ్రీ విశ్వ విజ్ఞ్ఞాన విద్యా ఆథ్యాత్మిక పీఠం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరుపున ఉత్తరప్రదేశ్, గోరఖ్ పూర్ లో ఎస్.ఎస్. అకాడమీ స్కూల్ నందు 4, 5, 6, 7 తరగతుల విద్యార్థులు 92 మందికి “తాత్విక బాల వికాస్” శిక్షణా తరగతులు రెండు రోజులు అనగా 13-05-2019 సోమవారం మరియు 14-05-2019 మంగళవారం నాడు పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో సత్తి భోగరాజు గారు, రమ్యసుధ గార్ల దంపతులచే నిర్వహించబడ్డాయి.
ఇందు నిర్వహించబడ్డ కార్యక్రమముల వివరములు.
జ్యోతి ప్రజల్వన, ముఖ్య అతిధులు: డాక్టర్ మీనాక్షి జైస్వాల్ (ఎం.డి) (మైక్రోబిలోజిస్ట్), డాక్టర్ ఆర్తి జైస్వాల్ (డెంటిస్ట్), స్కూల్ ప్రిన్సిపాల్ మిస్టర్. కనుక హరి అగర్వాల్ మరియు స్కూల్ ప్రిన్సిపాల్ మిస్సెస్ నిషి అగర్వాల్ కార్యక్రమమును ప్రారంభించినారు. అనంతరం విద్యార్దులచే గురుబ్రహ్మ శ్లోకం, ధ్యానం, ప్రొజెక్టర్ లో నీతి కధలు వీడియో లో చూపించి అందులోని నీతిని వివరించారు. చెట్ల వల్ల ఉపయోగాలు పిల్లలకు అర్ధమయ్యే విధంగా వీడియో చూపించి వివరించారు. ఆడపిల్లలకు ప్రత్యేకంగా “గుడ్ టచ్ – బ్యాడ్ టచ్” గురించి వీడియో చూపించి వివరించారు.
పిల్లలతో క్రింద యాక్టివిటీస్ నిర్వహించినారు
1. వ్యర్ధ ప్లాస్టిక్ తో పక్షులకు చలివేంద్రం కార్యక్రమం
ఈ కార్యక్రమాన్ని సత్తి భోగరాజు గారు పిల్లలతో స్వయంగా చేయించారు. అనంతరం వాతావరణాన్ని పరిరక్షించుకోవాలని లేకుంటే వచ్చే అనర్ధాలను సత్తి భోగరాజు గారు, రమ్యసుధ గార్లు వివరించారు.
2. కర్చీఫ్ లలో హ్యాండ్ ప్రింట్ వేయించి, క్రింద వాళ్ల గోల్ ఏమిటో వ్రాయించారు.
3. భారతదేశ విశిష్టత మరియు భారతీయుల గొప్పతనం వివరించారు.
పిల్లలకు మొక్కలను పంచి ఇచ్చి, వేసవి శెలవులలో పక్షులకు నీటిని అందించమని మరియు మొక్కలను జాగ్రత్తగా పెంచమని, ఇందుకోసం పిల్లలకు సహకరించవలసినదిగా తల్లితండ్రులకు సూచనలు తెలియజేసారు.
ఆటలు నిర్వహించి బహుమతులుగా నీతి పుస్తకాలను ప్రధానం చేసారు. తల్లితండ్రులను పిలిచి వారికి పిల్లలచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చివరిగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ ఇంత గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహింపజేస్తున్న డాక్టర్ ఉమర్ అలీషా గారిని, వారి సేవా తత్పరతను కొనియాడారు. పిల్లలు ఎంతో సంతోషంతో గురువుగారికి ధన్యవాదాలు తెలియజేసారు.
ఈ కార్యక్రమములో “హిందుస్థాన్” మరియు “రాష్ట్రీయ సహారా” పత్రికాపాత్రికేయులు పాల్గొన్నారు.
||శుభమ్||
పత్రికలలో – “హిందుస్థాన్” మరియు “రాష్ట్రీయ సహారా”