పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాల మేరకు అత్తిలి నుండి గుమ్మంపాడు లాకులు వరకు కాలువ గట్టు రోడ్డులో ది. 31 ఆగష్టు 2019 శనివారం రోజు “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమములో పీఠం సభ్యులు మొక్కలు నాటేరు. ఈ కార్యక్రమములో సూపరింటెండెంట్ శ్రీ బేబి రత్నం గారు, శ్రీ వీ.వై.ఆర్ సాయి కుమార్ గారు ఐ.సి.ఏ, శ్రీ మోహన్ గోపాల్ గారు ఐ.సి.ఏ, జల వనరుల శాఖ వారు మరియు అత్తిలి పీఠం సభ్యులు పాల్గొన్నారు.