ప్లాస్టిక్ వాడకం మాని పంచ భూతాలు కలుషితం కాకుండా ప్రతీ ఒక్కరిలో అవగాహన పెంచాలని డా. ఉమర్ ఆలీషా స్వామి పిలుపు నిచ్చారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా కాకినాడ వాకలపూడి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవానికి పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు అధ్యక్షత వహించగా, ట్రాఫిక్ DSP శ్రీ వేంకటేశ్వర రావు గారు, ప్రగతి అకాడమిక్ డైరక్టర్ శ్రీ G. రఘురామ్ , పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు వేదిక నలంకరించి ప్రసంగించారు.
పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం నివారించుట ద్వారా, ప్రతీ ఒక్కరూ 3 మొక్కలు నాటుట ద్వారా పంచ భూతాలు కలుషితం కాకుండా కాపాడ వచ్చు అన్నారు . ప్లాస్టిక్ నీటిలో కలిసి నీరు కలుషితమై, మత్స్య సంపద తగ్గి, జలచరాలు అంతరించి పోయి, ఆహార కొరత ఏర్పడునని అన్నారు.
ట్రాఫిక్ DSP శ్రీ వేంకటేశ్వర రావు గారు మాట్లాడుతూ సేవకు తాత్వికత జోడించి లక్షలాది సభ్యులను తీర్చి దిద్దుతున్నారని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా గార్ని అభినందించారు. ప్రజల్ని చైతన్య పర్చే పర్యావరణ కార్యక్రమాలు రెండు రాష్ట్రాలలో చేపట్టుట ఆనంద దాయక మని అన్నారు.
ఆశ్రమ ప్రాంగణంలో పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి మరియు DSP శ్రీ వేంకటేశ్వర రావు గారు మొక్కలు నాటి, పక్షుల కొరకు ధాన్యపు కుచ్చులను వేలాడ తీశారు. పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి,DSP శ్రీ వేంకటేశ్వర రావు గారు కూడా జెండా ను ఊపి, ర్యాలీ ని ప్రారంభించారు. ఈ ర్యాలీ వాకపూడి ఆశ్రమం నుండి సర్పవరం జంక్షన్ మీదుగా బోట్ క్లబ్ వద్ద గల మజ్జిగ చలివేంద్రం వరకు సుమారు 100 మంది ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యకర్తలు ర్యాలీ లో పాల్గొన్నారు. శ్రీమతి కాకినాడ లక్ష్మి శ్రీమతి అనిశెట్టి సత్యవతి పాడిన పర్యావరణ పరిరక్షణ కీర్తన సభికులను అలరింప చేసినది.
యూత్ లీడర్ మహేంద్ర వర్మ నాయకత్వంలో యువతీ యువకులు ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో నిర్వాహకులు శ్రీమతి కాకినాడ లక్ష్మి, శ్రీమతి రెడ్డి సూర్య ప్రభావతి, వనుము మణి, శ్రీమతి మండా ఏల్లమంబ, శ్రీమతి దాట్ల శ్రీదేవి, శ్రీమతి బాదం లక్ష్మి కుమారి, శ్రీ K.వీరభద్ర రావు,శ్రీమతి చిర్ల లలిత, శ్రీమతి ముదునూరి శ్రీదేవి, శ్రీమతి పేరూరి కోమలి తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
పేరూరి సూరిబాబు,
పీఠం కన్వీనర్.
9848921799.