పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాల మేరకు బల్లిపాడు ప్రాధమిక పాఠశాల నెం.1 లో ది. 27 ఆగష్టు 2019 మంగళవారం రోజు “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమములో 100 మొక్కలు నాటేరు. ఈ కార్యక్రమములో తాడేపల్లిగూడెం సబ్ ట్రెజరీ అధికారి శ్రీ గారపాటి గోపాలరావు గారు పాల్గొని “నామొక్క నా శ్వాస” లో భాగంగా ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని, ప్రతీ మొక్క నిస్వార్థంగా ఆక్సిజన్ ఏ విధంగా అయితే ప్రజలకిస్తుందో అదే విధంగా ప్రతి మనిషి కూడా పరులకోసం ఎంతో కొంత నిస్వార్థ చెయ్యాలని అన్నారు. దీనిలో భాగంగా ఆయన 500 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకొని బల్లిపాడు గ్రామంలో నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీ పి. గోపాలకృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ నాటిన ప్రతీ మొక్కను విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు దత్తత ఇచ్చి పరిరక్షణ చేపడతామని, ఇటువంటి మంచి కార్యక్రమాలు గురువులు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా గారు చేయడం శుభదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం సబ్ ట్రెజరీ అధికారి శ్రీ గారపాటి గోపాలరావు గారు, మాజీ మదన ట్రస్టీ శ్రీ గారపాటి ధర్మారావు గారు, శ్రీ గారపాటి బాబ్జీ గారు, ఎల్.ఐ.సి శ్రీ గారపాటి నాగేశ్వరరావు గారు పీఠం సభ్యులు శ్రీ కట్రెడ్డి షాబాబు గారు, శ్రీ దంగేటి రామకృష్ణ గారు మరియు పీఠం సభ్యులు శ్రీ గారపాటి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Video link below