“ఐడీఎల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ (ఐ.అర్.డి.ఎస్)” ది.13 డిసెంబర్ 2019 శుక్రవారం “సంచార జాతుల (పిట్టల) తో ఆత్మీయ సమావేశం” పిట్టలవాడ గ్రామం, కొండపాక మండల్, సిద్దిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం లో ఏర్పాటు చేసినది.
ఈ కార్యక్రమం లో శ్రీ కిషన్ గారు, శ్రీ ఉమా కాంత్ గారు మరియు శ్రీ స్వర్ణలత గారు ప్రసంగించినారు.
శ్రీ కిషన్ గారు:– వారు ఎలా వచ్చింది తమ జీవన విధానాన్ని వివరించారు. 12-13 ఏండ్లకే పెళ్లి చేస్తాము.
శ్రీ ఉమా కాంత్ గారు: – నీతిగా బతికే సంచార జాతులు. అభివృద్ధి చెందాలనే తపన మార్పును తీసుకొనిరావాలి. కష్టపడాలి, ఆరోగ్యంగా ఉండాలి.కొద్దిగా మార్పు చెంది 18 ఏళ్లకు పెళ్లి చేద్దాము. మానసికంగా, శారీరకంగా బలంగా ఎదుగుతారు. తాగుడు మాని వేస్తామని కమ్యూనిటీ చెప్పింది. కనీసం ఒక్కరిని డిగ్రీ వరకు చదివిద్దాం.
శ్రీ స్వర్ణలత గారు: – మనకోసం మనం ఏదైనా చేసుకోవాలి. పిల్లలు బాగు పడాలి అనే తపన మాత్రమే ఉంది. ఖచ్చితంగా పిల్లలను చదివించాలి. పెళ్లి వయస్సు వచ్చినా కనే పెళ్లి చేయాలి.
ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరపున ఉచితముగా 35 రగ్గులు పిట్టలవాడ గ్రామం, దమ్మక్కపల్లి గ్రామాల లో ని పేదవారికి శ్రీ కిషన్ గారు, శ్రీ ఉమా కాంత్ గారు, శ్రీ స్వర్ణలత గారు పంపిణీచేశారు.