Press note
మొక్కలు నాటి పుడమి ని సంరక్షించాలని కాకినాడ DSP శ్రీ V భీమారావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాకినాడ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, కాకినాడ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు అధ్యక్షత వహించగా, కాకినాడ DSP శ్రీ V భీమారావు గారు ముఖ్య అతిథిగాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్య వైశ్య మహిళ విభాగం అధ్యక్షురాలు శ్రీమతి నాళం ఆండాళ్ వారి భర్త శ్రీ వెంకటేష్, సెంట్రల్ కమిటీ మెంబర్ శ్రీ AVV సత్యనారాయణ అతిథులు గాను వేదిక పై ఆశీనులై ప్రసంగించారు. శ్రీమతి నాళం ఆండాళ్ గారు మాట్లాడుతూ మనం నాటిన మొక్కలు మన తరానికే కాకుండా తర్వాత తరాలు వారు కూడా ఆరోగ్యంగా ఉండగల్గుతారని అన్నారు. సభాద్యక్షులు శ్రీ సూరిబాబు మాట్లాడుతూ, పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి అజ్ఞ ప్రకారం 99 ఆశ్రమ శాఖల ద్వారా,9 లక్షల మంది పీఠం శిష్యులు మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవుతారని అన్నారు . పంచభూత మయుడైన మానవుడు పంచ భూతాలను కలుషితం కాకుండా కాపాడుకోవాలి అని అన్నారు.DSP శ్రీ భీమారావు గారు మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్క ఆక్సీజన్ సిలిండర్ తో సమానమని అన్నారు. మానవతా విలువలు పరిరక్షిస్తున్న పీఠాధిపతుల పరంపరకు నమస్కారాలు తెలియ చేసారు . అనంతరం కాకినాడ ఆశ్రమ ప్రాంగణంలో DSP గారు కొబ్బరిమొక్క, నాళం ఆండాళ్ గారు మామిడి మొక్క, స్థల దాత శ్రీమతి దాట్ల శ్రీదేవి గారు మరియు కమిటీ సభ్యులు కూడా మొక్కలు నాటారు.
అనంతరం పర్యావరణం పై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ర్యాలీ DSP శ్రీ భీమారావు గారు, శ్రీమతి నాళం ఆండాళ్ గారు జెండా ఊపి ప్రారంభించగా, సుమారు 90 మంది మహిళలు, యువకులు ర్యాలీ లో పాల్గొన్నారు. ర్యాలీ వాకలపూడి ఆశ్రమం నుండి సర్పవరం జంక్షన్ మీదుగా బోట్ క్లబ్ వద్ద గల ఉమర్ ఆలీషా స్వామి విగ్రహం వద్ద గల మజ్జిగ చలివెంద్రం, పక్షుల చలివెంద్రం వరకు ర్యాలీ కొనసాగింది. మజ్జిగ చలివెంద్రం లో నెల రోజుల నుండి సేవలు అందిస్తున్న శ్రీమతి రెడ్డి సూర్య ప్రభావతి గార్ని DSP గారు శాలువా కప్పి సన్మానించారు. చలివెంద్రం వద్ద సేవలందించిన వారందరికీ కూడా DSP గారు అభినందించారు.
ఈ కార్యక్రమంలో కాకినాడ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి మండా ఏల్ల మాంబ, శ్రీమతి బాదం లక్ష్మి కుమారి, కాకినాడ లక్ష్మి, రెడ్డి సూర్య ప్రభావతి, వనుము మణి, శ్రీమతి దాట్ల శ్రీదేవి, షేక్ అమీర్ భాషా, పేరురి సన్యాసిరావు, శ్రీ చిర్ల వెంకట రెడ్డి గారు కార్యక్రమాన్ని నిర్వహించగా శ్రీ AVV సత్యనారాయణ గారు వందన సమర్పణ చేశారు.
ఇట్లు
పేరూరి సూరిబాబు,
పీఠం కన్వీనర్,
98489 21799.