పోలవరం మండలం గడ్డపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడినది | UARDT | 17th March 2024

కొండరెడ్లకు ఉచిత మెగా వైద్య శిబిరం.
పోలవరం మండలం గడ్డపల్లి గ్రామంలో 17 మార్చ్, 2024న ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్న దృశ్యం.
మానవసేవే మాధవ సేవగా భావించే వైద్య ప్రముఖులు అరుదుగా ఉంటారని, అటువంటి వారిలో గోలి రామారావు ఒకరని ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కన్వీనర్ కట్టా లక్ష్మి పేర్కొన్నారు. గడ్డపల్లి గ్రామంలోని ఆదివారం రాజమండ్రికి చెందిన ప్రముఖ వైద్యులు గోలి రామారావు ఆధ్వర్యవంలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపులో ఆమె పాల్గొన్నారు. కరోనా విపత్కర పరిస్థితులను కొండరెడ్లు వారి జీవన ఆహార శైలి వల్లనే ఎన్ని వేరియంట్లనైనా ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో ఇప్పటివరకు గిరిజన ప్రాంతాలలో 117 మెడికల్ క్యాంపులను నిర్వహించారు.

uardt2000, #uardt2000, #Pithapuram, #kannapuram, #FreeMedicalCamp, #Medical, #MedicalCamp, #umaralisha, #drumaralisha, #gaddapalli, #Polavaram

Back To Top