ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు
జూన్ 5, 2024 : ఏ.ఎస్.ర్ హెూమియోపతి మెడికల్ కాలేజ్, తాడేపల్లిగూడెం మరియు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, పిఠాపురం వారి సంయుక్త ఆధ్వర్యములో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించబడినవి. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, తాడేపల్లిగూడెం రిజిస్ట్రార్ డా. బి. శ్రీనివాసులు, పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమమును ప్రారాంభించారు.
ఈ కార్యక్రమములో సుమారు వందకు పైగా ఓషధ మొక్కలు, పళ్ల మొక్కలు, నీడను ఇచ్చే మొక్కలు నాటడము మరియు కళాశాల ఆవరణ లో ఉన్న మొక్కలను గుర్తురించి వాటికి శాస్త్రీయ నామము మరియు వాడు నామములు తో ప్రదర్శన బోర్డులు కుడా ఏర్పాటు చేయడమైనది. అలాగే విద్యార్థులతో ప్లాంట్ అడిట్ కూడా నిర్వహించి నాటిన మొక్కలను పెంచి పెద్దచేసే భాధ్యతను విద్యార్థులకు మరియు సిబ్బందికి అప్పగించడమం జరిగినది. ఈ సందర్భముగా నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతులు ప్రశంసాపత్రములు అతిధుల చేతులమీదుగా ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భముగా డా.బి. శ్రీనివాసులు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ, మన అందరి భాద్యత అని, కీటకాలలో అతిముఖ్యమైన తేనెటీగలు లేక పోతే మానవ మనుగడ సాధ్యము కాదని, ప్రతిఒకరు ఒక మొక్క నాటాలని, ఆగ్రో హెూమియోపతి అనే అంశమై హార్టికల్చర్ విశ్వ విద్యాలయం లో రానున్న రోజులలో పరిశోధన అవకాశములు కొరకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారి సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమములో ఏ. ఎస్ ర్ హెూమియోపతిక్ మెడికల్ కళాశాల, ప్రిన్సిపల్, ప్రొఫెసర్ డాక్టర్ యు. ఎస్. వి ప్రసాద్, మాట్లాడుతూ, ప్రతి ఒక్క విద్యార్థి ప్రతో రోజు మొక్కలకు, నీళ్లు పోసి పెంచి పెద్దచేయాలని, రానున్న రోజులలో వారు నాటిన ఈమొక్కలే సాక్షాలుగా ఉంటాయని, భావితరాలు బాగుండాలి అంటే ఈ రోజు మనం నాటిన మొక్కలే కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమములో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, కన్వీనర్ మరియు ఎఎస్ఆర్ హెూమియోపతిక్ మెడికల్ కళాశాల అనాటమి విభాగాధిపతి ప్రొఫెసర్ డా. ఆనంద కుమార్ పింగళి మాట్లాడుతూ ప్రతి మొక్క ఒక ఆక్సీజెన్సీలిండెర్ వంటిదని, “నా మొక్క నాశ్వాస” అనే నినాదంతో ట్రస్ట్ ద్వారా పర్యావరణ పరిరక్షణ కు కృషి చేయడం జరుగుతొందని అన్నారు.
ఈ కార్యక్రమములో ప్రొఫెసర్ డాక్టర్ తులసి వెంకటేశ్వరులు, ప్రొఫెసర్ డాక్టర్ ఆనంద రావు, ప్రొఫెసర్ డాక్టర్ సి వి ఎస్ ఆర్ ప్రసాద్ కళాశాల ఇతర అధ్యాపకులు, విద్యార్థులు, ట్రస్ట్ ప్రతినిధులు పి కలికి మూర్తి, రామకృష్ణ మరియు ఇతర ట్రస్ట్ కార్యకర్తలు పాల్గొన్నారు.