UARDT established Bird Chalivendram at Vallurupalli Village on 23-May-2020

పక్షుల చలివేంద్రం
ది. 23-05-2020

శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి శ్రీ డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యుల ఆదేశాల మేరకు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెంటపాడు మండలం వల్లూరుపల్లి గ్రామంలో పీఠం సభ్యుడు శ్రీ దంగెటి రామకృష్ణ గృహ ఆవరణలో పక్షుల వేసవి విడిది కేంద్రం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ చలివేంద్రాన్ని తాడేపల్లిగూడెం అగ్రికల్చర్ అడిషనల్ ఆఫీసర్ శ్రీ A. మురళీకృష్ణ గారు, తాడేపల్లిగూడెం ఉపఖజానా అధికారి శ్రీ గారపాటి గోపాలరావు గారు ప్రారంభించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాడేపల్లిగూడెం ఉపఖజానా అధికారి గోపాలరావు గారు మాట్లాడుతూ స్వామి చెప్పిన ప్రకారం మూగజీవులకు వేసవికాలంలో ఆహారం మరియు నీరు అందించాలని అన్నారు. ‘ప్రార్ధించే పెదవులకన్న సాయంచేసే చేతులు మిన్న’ అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా పేదవారికి సాయంచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిదిగా పాల్గొన్న A. మురళీకృష్ణ గారు మాట్లాడుతూ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యకమలు చేస్తున్నారు. నా మొక్క నా శ్వాస కార్యక్రమం ద్వారా మొక్కలని పెంచడం, కోవిడ్ – 19 కారణంగా తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో 50000 మందికి కరోనా వైరస్ వ్యాధి నివారణ మందులను పంచిపెట్టటం, మూగజీవులకు పక్షుల చలివేంద్రాలు ఏర్పాటుచేయటం ఉపఖజానా అధికారి గారపాటి గోపాలరావు గారి బృందం ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయం అన్నారు.
ఈ కార్యక్రమంలో కంచుమర్తి నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అన్ని చోట్లా, అన్ని వేళలా పీఠం సభ్యులు అనేక కార్యక్రమాలు చెయ్యటం అభినందనీయం అన్నారు.
ఈ కార్యక్రమంలో వల్లూరుపల్లి గ్రామ పీఠం కన్వీనర్ శ్రీమతి పుల్లా తిరుమల గారు, పీఠం సభ్యులు, శ్రీ A. మురళీకృష్ణ గారు,శ్రీ గారపాటి గోపాలరావు గారు, శ్రీ కట్రెడ్డి షాబాబు గారు, శ్రీ దంగెటి రామకృష్ణ గారు,శ్రీ తోట సత్యనారాయణ గారు, శ్రీ బొండపల్లి శ్రీనివాసు గారు, శ్రీ అడపా ఇంద్రేశ్వరరావు గారు, శ్రీ గిద్దా త్రిమూర్తులు గారు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ఇట్లు
దంగెటి రామకృష్ణ
వల్లూరుపల్లి
పెంటపాడు మండలం.

Back To Top