పర్యావరణ పరిరక్షణ దినోత్సవం
ది.05/06/2020 శుక్రవారం తాడేపల్లిగూడెం
శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాల మేరకు డా.ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్బంగా సబ్ ట్రేజరీ కార్యాలయంలో “నా మొక్క నా శ్వాస” అనే నినాదంతో ఉపఖజానా అధికారి శ్రీ గారపాటి గోపాలరావుగారు, పెన్షన సంఘం అధ్యక్షులు శ్రీ దాసం నాగేశ్వరరావుగారు, హరికుమార్ గారు మరియు పీఠం సభ్యులు కలిసి మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపఖజానా అదికారి శ్రీ గారపాటి గోపాలరావుగారు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మొక్కల వల్లే పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందని దాని వలన పంచ భూతాలు సమతుల్యత గా ఉంటాయని వాటి వలన వర్షాలు సకాలంలో పడతాయని అందువల్ల మానవమనుగడ అనుకూలంగా ఉంటాయని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెన్షన్ శాఖ వైస్ ప్రెసిడెంట్ హరికుమార్ గారు మాట్లాడుతు యస్.టి.ఒ గోపాలరావు గారు గత సంవత్సరం 900 మొక్కలు నాటడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ప్రారంభించారు.ఈ విధంగా ప్రతి సంవత్సరం ఇలాగే కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను అని మరియు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ వలన ప్రపంచ శాంతి కరోనా వ్యాధి నిరోధానికి అవకాశం కలుగుతుందని అన్నారు. పెన్షన్ శాఖ అధ్యక్షులు దాసం నాగేశ్వరరావుగారు మాట్లాడుతు ఉపఖజానా అదికారి శ్రీ గారపాటి గోపాలరావుగారు ట్రస్టు తరుపున “నా మొక్క నా శ్వాస” కార్యక్రమం ద్వారా మొక్కలు పంపిణీ చేయడం, కరోనా నిరోధక హోమియో మందులు పంపిణీ, ఉచిత కుట్టు మిషన్లు నిరుపేద మహిళలకు పంపిణీ జరుగుతుందని అన్నారు. పీఠం సభ్యులు పుల్లబాబి మాట్లాడుతు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా 2002 నుండి అనేక సేవ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగానే నిరక్షరాస్యులను అక్షరాస్యులను చేయడం,నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడం, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినపుడు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేయటం జరుగుతుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో గారపాటి గోపాలరావు, భువనేశ్వరి కుటుంబసభ్యుల ద్వారా నా మొక్క నా శ్వాస” అనే కార్యక్రమము లో
100 మందికి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కట్రెడ్డి షాబాబు, దంగేటి రామకృష్ణ, దారుపురెడ్డి చిన్న వెంకన్న, పుల్ల బాబి, దారుపురెడ్డి చంద్ర మరియు పెన్షన్ సంఘ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
గారపాటి గోపాలరావు,
ఉపఖజానా అధికారి.