Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

నా మొక్క నా శ్వాస కార్యక్రమం, పిఠాపురం – 26 September 2024

Press note 26-9-24 పిఠాపురం
నా మొక్క నా శ్వాస కార్యక్రమం ద్వారా పిఠాపురం నందనవనం గా మార్చి, అనారోగ్యాలు తొలగించుకోమని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు అనుగ్రహ భాషణ చేశారు. గురువారం ఉదయం స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పిఠాపురం రైల్వే స్టేషన్ మాస్టర్ శ్రీ పి. నాగ బాబు అధ్యక్షత వహించగా, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి ముఖ్య అతిథిగా, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీ యెన్. కనకారావు, రీజనల్ బయో డైవర్సిటీ కోఆర్డినేటర్ శ్రీ సత్య ప్రసాద్, రైల్వే యూనియన్ చైర్మన్ శ్రీ టి. ఈశ్వరరావు, శ్రీ బి. జనార్ధన రావు, గురువు గారి సోదరుడు అహ్మద్ ఆలీషా అతిథులు గా పాల్గొని మొక్కలు నాటిరి .పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి మాట్లాడుతూ మొక్కలు నాటుట ద్వారా జీవ వైవిద్యం కాపాడాలని మరియు అనేక ఆరోగ్యం సమస్యలకు పరిష్కారం లభించునని, కావున ప్రతీ ఒక్కరూ మూడు మొక్కలు నాటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరుపం గా మొక్కలు పెంచి, పిఠాపురం పట్టణం హరిత వనం గా చేసి, స్వచ్చమైన ఆక్సిజన్ పొందాలని పిలుపు నిచ్చారు. మున్సిపల్ కమిషనర్ శ్రీ కనక రావు మాట్లాడుతూ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, డివిషనల్ ఫారెస్ట్ అధికారుల పర్యవేక్షణ లో పిఠాపురం పురపాలక సంఘం మొక్కలకు రక్షణ గా ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేస్తామని కమిషనర్ శ్రీ కనక రావు అన్నారు. పిఠాపురం పట్టణము లో వ్యక్తిత్వ నైపుణ్యం కొరకు సర్వే చేస్తామని అన్నారు. స్టేషన్ మాస్టర్ శ్రీ నాగ బాబు గారు మాట్లాడుతూ రైల్వే స్టేషన్ ఆవరణ హరిత వనం గా తీర్చి దిద్దుటకు సంకల్పిం చిన పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు, కౌన్సిలర్ నగేష్, శివరామకృష్ణ, యెన్.టి.వి ప్రసాద వర్మ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
పేరూరి సూరిబాబు,
కన్వీనర్,
9848821799

Umar Alisha Rural Development Trust © 2015