ఆదికవి నన్నయ యూనివర్సిటీ డాక్టర్ వినయ్ సుంకర హెల్త్ సెంటర్ లో ఉచిత హోమియోపతి వైద్య కేంద్రాన్ని వీసీ ఆచార్య కె.పద్మరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పిఠాపురం వారి సౌజన్యంతో ఫ్రీ హోమియోపతిక్ మెడికల్ సర్వీస్ ను ప్రారంభించామని అన్నారు. యూనివర్సిటీ హెల్త్ సెంటర్ లోని ప్రతి బుధవారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు నిష్ణాతులైన వైద్య బృందం అందుబాటులో ఉంటారని చెప్పారు. […]