


Press note
నాగరికత కన్నా నాగలి కథ చాలా గొప్పదని శ్రీ VV Laxmi Narayan అన్నారు. అన్నదాతల సౌభాగ్యం కొరకు ఏరువాక పౌర్ణమి పుణ్య కాలంలో మంగళవారం ఉదయం పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన “సస్య వృద్ధి భీజారోపణ ఉత్సవానికి పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సోదరుడు అహ్మద్ ఆలీషా అధ్యక్షత వహించగా CBI మాజీ JD Sri VV లక్ష్మీ నారాయణ ముఖ్య అతిథిగాను, రైతు నేస్తం శ్రీ నందెల ఏడు కొండలు ప్రత్యేక అతిధి గాను, ఉమర్ అలీషా పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీ హుస్సేన్ షా, కార్యక్రమ నిర్వాహకులు శ్రీ AVV సత్యనారాయణ వేదిక నలంకరించి ఆధ్యాత్మిక వ్యవసాయం ప్రాధాన్యతను సభలో అసీనులైన రైతులను చైతన్య వంతులను చేశారు. అహ్మద్ ఆలీషా జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించగా, శ్రీ VV లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ రైతు పండించిన పంటను రూపాంతరం చేసి, వ్యవసాయం లాభసాటిగా మార్చుకోమని పిలుపు నిచ్చారు. ప్రత్యేక అతిధి శ్రీ నందెల ఏడుకొండలు మాట్లాడుతూ వ్యవసాయం జీవనోపాధి గా కాకుండా జీవన విధానం గా తీర్చిదిద్దుకోమని వారి శ్వనుభవాన్ని సభకు వివరించారు. జీవ వైవిధ్యాన్ని పొలంలో అభివృద్ధి చేయాలన్నారు. ప్రకృతిక వ్యవసాయకులు శ్రీ మృత్యుంజయ మాట్లాడుతూ 80 రకాల దేశీయ విత్తనాలను అభివృద్ధి చేశాను అన్నారు. రైతుల గొక్రుపామృతం సమాచార పత్రాన్ని శ్రీ VV లక్ష్మి నారాయణ ఆవిష్కరించి రైతులకు అంద చేశారు. ప్రత్యేక అతిధి శ్రీ నందెల ఏడుకొండలు గారు తయారు చేసిన గో కృప అమృతం తయారు చేసే విధానం, వినియోగించే విధానం సభలో రైతులకు తెలియ చేశారు. గో కృపా అమృతం సీసాలను రైతులకు అంద చేశారు. అహ్మద్ అలీషా గారు కొలంబో కంది చెట్ల విత్తనాలను ఆవిష్కరించి రైతులకు అందచేశారు. పక్షుల ఆహారం కొరకు శ్రీ VV లక్ష్మీ నారాయణ గారు ధాన్యపు కుచ్చును రైతు రామకృష్ణ కు అంద చేశారు. హుస్సేన్ షా గారు మాట్లాడుతూ రైతే రారాజు అని రైతు ను కాపాడుకుంటే దేశం అభివృద్ధి సాదిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమము లో పీఠం కన్వీనర్ శ్రీ పేరురి సూరిబాబు ఆహ్వానం పలుకగా శ్రీ NTV ప్రసాద వర్మ వందన సమర్పణ చేశారు. హారతి తో సభ ముగిసింది. పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా స్వామి అబౌతిక ఆశీస్సులు వాశక్సందేసం ద్వారా తెలియ చేశారు.
ఇట్లు
శ్రీ AVV సత్యనారాయణ,
ప్రోగ్రాం కోఆర్డినేటర్.
PRINT MEDIA COVERAGE



Electronic media coverage