Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 600 (students and staff) at Kode Venkatrao Municipal High School, Tadepalligudem on 18-March-2020.
కరోనా వైరస్ అవగాహన సదస్సు మరియు ఉచిత హొమియో వ్యాధి నిరోధక మందులు పంపిణీ
శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డా౹౹ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాలమేరకు డా౹౹ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ది 18- 3-2020 న తాడేపల్లిగూడెం కోడే వెంకట్రావు మున్సిపల్ హైస్కూలు ప్రధానోపాధ్యాయురాలు మరియు ఏ.పి.టి.ఎఫ్ వారి సమక్షంలొ తాడేపల్లిగూడెం
ఎస్.టి.ఓ గారపాటి గోపాలరావు గారు, శ్రీమతి భువనేశ్వరి దంపతులు కరోనా వైరస్ అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఉచిత హోమియో వ్యాధి నిరోధక మాత్రలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు కరోనా వైరస్ జాతీయ విపత్తుగా ప్రపంచ దేశాలు ప్రకటించడం జరిగింది. కరోనా నివారణకు ముందుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ పూరేటి వెంకటరత్నం గారు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎస్.టి.ఓ గోపాలరావు దంపతులు అభినందనీయమన్నారు. పీఠం సభ్యులు శ్రీ కట్రెడ్డి షాబాబు గారు మాట్లాడుతూ పీఠం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది “నామొక్క నాశ్వాస” కార్యక్రమం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం, వేసవి కాలంలో చలివేంద్రాలు, పక్షులకు కూడా చలివేంద్రాలు ప్రస్తుతం కరోనా వ్యాధి నిరోధక మాత్రలు పంపిణీ చేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ గారపాటి గోపాలరావు గారు మాట్లాడుతూ పీఠాధిపతి డా౹౹ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాలతో మరియు ఆశీస్సులులతో కరోనా వైరస్ వ్యాధి నిరోధక అవగాహన సదస్సులు మరియు ఉచిత హొమియో మందులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ప్రార్థించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న ప్రతీ మనిషి సాటి మనిషికి సేవ చేయాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు కనుక చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాలు చేయడం ఆధ్యాత్మికత అలవాటు చేయాలన్నారు. ఈ రోజు కోడే వెంకట్రావు మున్సిపల్ హైస్కూలు విద్యార్ధిని, విద్యార్థులకు కరోనా వైరస్ వ్యాధి నిరోధక అవగాహన మరియు ఉచిత మందులు పంచడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీ మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీ తోట సుబ్బారావు గారు ఏ.పి.టి.ఎఫ్ సంఘ నాయకులు శ్రీ నారాయణ గారు మరియు పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ పాఠశాలలో 250 మంది బాలబాలికలకు ఇతర సిబ్బందికి 600 మందికి ఉచిత మందులను పంపిణీ చేశారు.
ఇట్లు
ప్రదానోపాధ్యాయురాలు
కోడే వెంకటరావు మున్సిపల్ హైస్కూల్
తాడేపల్లిగూడెం
If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.
For more details please visit http://www.uardt.org/coronavirus/