Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Coronavirus preventive medicine distributed at Rajeev Gruhakalpa Buildings, Kakinada on 11-Apr-2020

Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 7000 people at Rajeev Gruhakalpa Buildings, Kakinada on 11-Apr-2020.

కరోనా వ్యాధి నిరోధానికి హోమియా మాత్రల పంపిణీ
రాజీవ్ గృహకల్ప లో కార్యక్రమం
కాకినాడ, 11 ఏప్రిల్ 2020:
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను రాకుండా అడ్డుకునేందుకు పిఠాపురంలోని ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత హోమియో మందులను కాకినాడ రాజీవ్ గృహకల్ప ప్రజలకు శనివారం పంపిణీ చేశారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కోఆర్డినేటర్ శ్రీమతి బాదం లక్ష్మి కుమారి గారు, సభ్యురాలు శ్రీ రుక్మిణీదేవి గారు, సీనియర్ జర్నలిస్టు శ్రీ ముగడ రామదాసు గారి ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. రాజీవ్ గృహకల్ప కి చెందిన వందలాది మంది ప్రజలు ఉచితంగా అందిస్తున్న హోమియో మందులను పొందారు. ఈ సందర్భంగా లక్ష్మి కుమారి మాట్లాడుతూ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి ఆదేశాల మేరకు హోమియో మందులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 12 లక్షల మందికి పైగా ఈ మందులు పంపిణీ చేసి ఈ వ్యాధి రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీమతి లక్ష్మి కుమారి గారు తెలిపారు. సీనియర్ పాత్రికేయులు శ్రీ రామదాసు గారు మాట్లాడుతూ డాక్టర్ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సేవలను కొనియాడారు. అదేవిధంగా హోమియో మందు పొందిన వారంతా మూడు రోజుల పాటు ఈ మందును వేసుకొని కరోనా వ్యాధి నియంత్రణకు తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఆర్.పి మండా మంగతాయారు గారు, స్థానికులు శ్రీ పితాని చంద్రశేఖర్ గారు, శ్రీ ముద్దాడ నరసింహ మూర్తి గారు తదితరులు పాల్గొన్నారు.

 

If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.

For more details please visit http://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015