Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 900 people at Sri Dangeti Ramakrishna’s Home, Vallurupalle Village on 12-March-2020.
పశ్చిమ గోదావరి జిల్లా,వల్లూరుపల్లి
ది.12/03/2020 గురువారం.
శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా సద్గురవర్యుల ఆదేశాలు మేరకు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోన వైరస్ వ్యాధి నిరోధక ఉచిత హోమియోపతి మందులను వల్లూరుపల్లి గ్రామంలో శ్రీ దంగేటి రామకృష్ణ ఇంటి ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా గారపాటి గోపాలరావు గారు మాట్లాడుతు దంగేటి రామకృష్ణ గారి కుటుంబ సభ్యులు ఉమర్ ఆలీషా డెవలప్మెంట్ ట్రస్ట్ కి విశిష్టమైన సేవలు చేస్తున్నారు. అందులో భాగంగా పక్షుల చాలివేంద్రం ఏర్పాటు చేయడం, నా మొక్క నా శ్వాస అనే నినాదం తో మొక్కలు నాటడం, ఈ రోజున కరోనా వైరస్ వ్యాధి నిరోధక మందులు వల్లూరుపల్లి గ్రామంలో శ్రీ గారపాటి గోపాలరావు గారు, శ్రీమతి భువనేశ్వరి గారి దంపతుల ద్వార మందులు పంచడం జరిగింది. వల్లూరుపల్లి తెలుగుదేశం నాయకులు శ్రీ అడ్డగార్ల గంగరాజు గారు మాట్లాడుతు స్వామి కార్యక్రమాలు బాగా చేస్తున్నారు మరియు మందులు పంచడం మానవసేవయే మాధవసేవగా భావించి చేస్తున్నటువంటి శ్రీ రామకృష్ణ గారి కుటుంబసభ్యులకు స్వామి ఆశీస్సులతో ఇంకా ఎన్నో సేవలు చేయాలని కోరుకుంటున్నాను.
శ్రీ షాబాబు గారు మాట్లాడుతు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠానికి రెండు కళ్ళు. అందులో ఒకటి చిన్నతనం నుంచి ఆధ్యాత్మికను అలవారుచుకోవడం, రెండవది సామజిక సేవ చేయాలని ప్రజల్లో కలిపించడం అని మాట్లాడుతు కరోన వైరస్ వ్యాధి నిరోధక మాత్రలు ఉమర్ ఆలీషా డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా స్వామి ఆశీస్సులతో పంపిణీ చేస్తున్నారు. అంతేకాకుండా
1.నిరక్షయ్యరాసులని అక్షరాస్యులగా తీర్చి దిద్దడం.
2.మెడికల్ క్యాంపు ల ద్వార ఉచిత వైద్య సేవలు, ఉచిత మందులు పంపిణీ చేయడం.
3.మహిళల అభివృద్ధి, ఆర్ధికంగా వెనుకబడిన మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేసి వారికి జీవనోపాధి ని కలిపించడం.
4.పర్యావరణ పరిరక్షణ అని ప్రతి మానవుడు మూడు మొక్కలు నాటి వాటికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అని పేర్లు పెట్టాలి .
5.ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు (తుఫాను, భూకంపం) బాధితులకు ఈ పీఠం ద్వారా బియ్యం, బట్టలు, పప్పులు వారికి ఇవ్వడం మరియు వేసవికాలంలో చాలివేంద్రాలు ఏర్పాటు చేయడం, ఇల్లు కాలిపోయిన వారికి వసతి కల్పించడం, వికలాంగుకులకు ఆర్థిక సహాయం చేయడం. ఇవన్ని ఈ పీఠము ద్వారా చేస్తున్నారని శ్రీ షాబాబు గారు అన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ దంగేటి రామకృష్ణ గారి కుటుంబసభ్యులు, ఉపఖజనా అధికారి (తాడేపల్లిగూడెం) శ్రీ గారపాటి గోపాలరావు గారు, శ్రీమతి భువనేశ్వరి గారు, వల్లూరుపల్లి తెలుగుదేశం నాయకులు శ్రీ అడ్డగార్ల గంగరాజు గారు, వల్లూరుపల్లి గ్రామ ఆరాధన కమిటి అధ్యక్షులు శ్రీ పుల్ల తిరుమల గారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఠం సభ్యులు శ్రీ కట్రెడ్డి షాబాబు గారు, శ్రీ దంగేటి శ్రీనుబాబు గారు, శ్రీ దంగెటి భవానీ గారు, శ్రీ పుల్ల ఉమేష్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామంలో 900 మందికి కరోన వైరస్ వ్యాధి నిరోధక హోమియోపతి మందులను పంపిణీ చేశారు.
ఇట్లు
శ్రీ దంగేటి రామకృష్ణ గారు,
వల్లూరుపల్లి
For more details please visit http://www.uardt.org/coronavirus/