ది. 13 అక్టోబర్ 2019 ఆదివారం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఉమర్ అలీషా డెవలప్మెంట్ ట్రస్ట్ తరపున శ్రీ సత్తి భోగరాజు రమ్య సుధ దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ లో గోరఖ్పూర్ సాహెబ్గుంజ్ కిరాణా మండే మార్కెట్ నందు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఇందులో భాగంగా వ్యాపారస్తులు, పల్లిదార్లు, బిచ్చగాళ్ళు అందరు కలసి సుమారు 500 మంది వరకూ మందులు స్వీకరించారు. జ్వరంతో బాధపడుతున్న బిచ్చగాళ్లు ఎంతో ఆనందంగా మందులు వేయించుకున్నారు. 30, 40 మంది బిచ్చగాళ్లకు మందులు వేయడం జరిగింది.