05 జూన్ 2022 నూతన ఆశ్రమ ప్రాంగణం లో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ప్రపంచ పర్యావరణ దినోత్సవం” ర్యాలీ

Press note
ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటితే వైరస్ ల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని జడ్జి శ్రీమతి సుధారాణి గారు అన్నారు. పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణం లో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు పీఠాధిపతి డా ఉమర్ అలీషా స్వామి సోదరుడు అహ్మద్ ఆలీషా సభకు అధ్యక్షత వహించగా, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి M. సుధా రాణి, వారి శ్రీవారు శ్రీ M. సింగా రావు, ముఖ్య అతిథులుగా వేదిక నలంకరించి ప్రసంగించారు. అహ్మద్ ఆలిషా గారు మాట్లాడుతూ మొక్కలు నాటడం ద్వారా ప్రకృతి ని కాపాడుకోవాలని, ప్రకృతే భగవత్ స్వరూపమని అన్నారు. పీఠం కన్వీనర్ ఆహ్వానం పలుకగా, శ్రీ RK శివరామ కృష్ణ గారు వందన సమర్పణ చేశారు. అనంతరం నూతన ఆశ్రమంలో జడ్జి గారు, సింగా రావు గారు, అహ్మద్ అలిషా గారు మొక్కలు నాటారు. అనంతరం పీఠం సభ్యులకు మామిడి మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం పర్యావరణం పై అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన ర్యాలీ ని జడ్జి శ్రీమతి సుధా రాణి గారు జెండా ఊపి ర్యాలీ ని ప్రారంభించారు. ఈ ర్యాలీ పిఠాపురం మెయిన్ రోడ్డు గుండా నిర్వహించ బడినది. ఈ కార్యక్రమంలో పీఠం కమిటీ మెంబర్ శ్రీ రేకా ప్రకాష్, VVV సత్యనారాయణ, చింతపల్లి అప్పారావు మాస్టారు,S. కృష్ణ కుమార్ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇట్లు
పేరూరి సూరిబాబు,
పీఠం కన్వీనర్,
98489 21799.

Back To Top