10-04-2023 న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వంగూరు బైపాస్ రోడ్డు, ఏలూరు శాఖ ఆశ్రమం నందు, శ్రీమతి దండు లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఏలూరు కమిటీ సభ్యులు మజ్జిగ చలివేంద్రం స్వామివారి ఆశీస్సులతో ప్రారంభించారు.
10-04-2023 న మహేశ్వరం మండలం హైదరాబాద్ లో పీఠాధిపతి బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలీషా వారు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మహేశ్వరం మండల్ సర్పంచ్ రాజేష్ గారు, ట్రస్ట్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతోమంది దాహార్తులకు స్వామి వారి చేతుల మీదుగా మజ్జిగ పంపిణి చేయడం జరిగిoది.