Below link shows the Masks Stitching process by Cheemalavarigudem Ashram members
https://drive.google.com/file/d/1oI0tspg7NmqqpDPyiQ_knRZKlH6Gqonu/view?usp=sharing
Free Masks Distribution on 31-March-2020
సమిష్టి కృషితోనే కరోనపై విజయం.
01) ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఐటీడీఏ పీవో తో కలిసి మాస్కులు పంపిణీ.
-యాచకులకు అన్నార్తులకు అన్న సంతర్పణ.
02) కొయ్యలగూడెం మండలం కన్నాపురం లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఐటిడిఎ పిఓ కు సానిటైజర్ ద్రావకాన్ని పోస్తున్న బాలరాజు.
03) కొయ్యలగూడెం మండలం కన్నాపురం లో పారిశుద్ధ్య కార్మికునికి మాస్కు కడుతున్న ఎమ్మెల్యే బాలరాజు.
04) కొయ్యలగూడెంలో యాచకులకు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న తెల్లం బాలరాజు.
కొయ్యలగూడెం: సమిష్టి కృషితోనే కరోనా మహమ్మారి పై విజయం సాధించగలుగుతామని శాసన సభాపక్ష ఎస్టీకమిటీ చైర్మన్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్కొన్నారు. మంగళవారం కన్నాపురం లో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరోనా వ్యాధి అవగాహన సదస్సులో ఆయన ఐటీడీఏ పీవో సూర్యనారాయణ తో కలిసి పాల్గొన్నారు. ప్రపంచం మునుపెన్నడూ లేని విధంగా భయంకర వ్యాధి ని ఎదుర్కొంటూ సతమతమవుతోంది అని దీనిని అవగాహనతోనో, తగినజాగ్రత్తలతో ఎదుర్కోవడం ఒకటే మార్గమని బాలరాజు అన్నారు. మిగిలిన దేశాలతో పోల్చితే భారతదేశం ముందస్తుగానే చర్యలు తీసుకుందని, అదేవిధంగా దేశంలోనే మన రాష్ట్రం తగిన విధంగా సకాలంలో స్పందించి వ్యాధి నిరోధక చర్యలు తీసుకోవడం వల్ల వ్యాధి గ్రస్తుల శాతాన్ని తగ్గించ గలిగామని బాలరాజు అన్నారు. విపత్కర పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొక్కవోని దీక్షతో అహర్నిశలు అధికారులకు యుద్ధప్రాతిపదికన సూచనలు చేస్తూ వ్యాధి నివారణకు చర్యలతో పాటు యిప్పటికే వ్యాధికి గురైన వారి సంరక్షణ చర్యలు చేపట్టారన్నారు. ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ ముప్పు వాటిల్లిన పక్షంలో ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ లను సమాయత్తం చేశారని ఐటీడీఏ పీవో సూర్యనారాయణరాజు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు మారుమూల గిరిజన గ్రామాలను సందర్శిస్తూ ఎప్పటికప్పుడు సూచనలు తగిన చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అతిథులు పేర్కొన్నారు. అనంతరం కొయ్యలగూడెంలో యాత్రికులకు అన్నార్తులకు నిర్వహించిన అన్నసంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైయస్సార్సీపి నియోజకవర్గ నేత పోతన శేషగిరిరావు, పార్టీ నాయకులు చొడిపిండి సుబ్రహ్మణ్యంల సౌజన్యంతో భాగంగా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సభ్యులు సహకారంతో సమకూర్చిన వెయ్య మాస్క్ లను పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ, పారిశుద్ధ్య రంగాలకు చెందిన వారికి అదేవిధంగా వాలంటీర్లకు పంపిణీ చేశారు. మండల కన్వీనర్ గొడ్డటి నాగేశ్వరరావు, పార్టీ నాయకులు కొండపల్లి శివాజీ, మటా సత్తిపండు, వుప్పలకృష్ణ, శంకు కొండ, గంజి మాల రామారావు తదితరులు పాల్గొన్నారు.