Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 150 students at Siddhartha School, Manchili Village on 10-March-2020.
పశ్చిమగోదావరి జిల్లా మంచిలి
అత్తిలి మండలం మంచిలి గ్రామంలోని సిద్ధార్ద పాఠశాలలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విధ్యార్దులకు కరోనా వైరస్ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల విషయంపై పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ పసుపులేటి సూర్యనారాయణ గారు మాట్లాడుతు చేతులు గంటకి ఒకసారి శుభ్రంగా సబ్బుతొ కడుక్కోవాలి, ముక్కుకి మాస్క్ తప్పనిసరిగా ధరించాలి అని చెప్పారు, నా స్నేహితుడైనటువంటి గోపాలరావు మంచి సద్గునాలు కలిగి ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఇద్దరం కలిసి చదువుకున్నాము. ముందుగా ఈ పీఠం ఎంతో గోప్పది అని చెప్పుకోవాలి. మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగా గోపాలరావు ఎప్పుడు అంటారు దేవుడు మనకి ఇచ్చినటువంటి రెండు కళ్ళని ఓకటి ఆధ్యాత్మికానికి, రెండవది సమాజ సేవకి ఉపయోగించాలి అని మా గురువుగారు చెప్తారు. ప్రతీ సంవత్సరం మజ్జిగ చలివేంద్రం ఏప్రిల్ 10వ తేదీ నుంచి జూన్ 15 వరకు పెట్టేవారు, దాదాపుగా గత 6 నెలలుగా 1000 పైగానే మొక్కలు నాటారు, వృద్ధులుకు బట్టలు ఇవ్వడం, కుట్టు మెషిన్లు ఇవ్వడంలాంటివి చేస్తున్నారు. ఇలాంటి సేవలు మీరు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. ఈ పీఠంకి మంచి పేరు తీసుకురావడమే కాకుండా నా మిత్రుడు ఈ విధంగా చేయడం చాలా గోప్ప విషయం నాకు ఎంతో గర్వంగా ఉంది అని చెప్పారు. తాడేపల్లిగూడెం యస్.టి.ఓ గారు మాట్లాడి 150 మంది విధ్యార్దులకు మందులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడం యస్.టి.ఓ గారి దంపతులు గారపాటి గోపాలరావు గారు, భువనేశ్వరి గారు, పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ పసుపులేటి సూర్యనారాయణగారు, పీఠం సభ్యులు శ్రీ కటిరెడ్డి షాబాబు గారు, శ్రీ దంగేటిరామకృష్ణ గారు పాల్గోన్నారు.
For more details please visit http://www.uardt.org/coronavirus/