Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 450 students at 7th Ward Municipal Primary School, Tadepalligudem on 11-March-2020.
పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం
ది 11 మార్చి 2020 బుధవారం స్థానిక 7వ వార్డు మున్సిపల్ ప్రాధమిక పాఠశాలనందు “ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” కార్యవర్గ సభ్యులు శ్రీ గారపాటి గోపాలరావు గారు (ఎస్.టి.ఓ, తాడేపల్లిగూడెం) మరియు వారి శ్రీమతి గారపాటి భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో పాఠశాల లోని పిల్లలందరికీ 150 ప్యాకెట్లు అనగా 450 మందికి కరోన వైరస్ వ్యాధి నిరోధక హోమియోపతి మందులు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎం.వినోదవర్ధన్ గారు మాట్లాడుతూ
ఉమర్ ఆలీషా ట్రస్ట్ వారు సేవా దృక్పథంతో ఇటువంటి కార్యక్రమాలు చేయటం అభినందనీయం. గతంలో పాఠశాల చుట్టూ 50 మొక్కలు నాటారు. అదేవిధంగా కరోనా వైరస్ బారిన పడకుండా ముందు జాగ్రత్తగా విద్యార్థులందరికి మందులు పంపిణీ చెయ్యటం అభినందనీయం అన్నారు. ఎస్.టి.ఓ గోపాలరావు గారు మాట్లాడుతూ అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని, వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరూ ఈ మందుని వాడితే వ్యాధిని త్వరితగతిన నిరోధించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు శ్రీమతి గారపాటి భువనేశ్వరి గారు, ఉపాధ్యాయురాలు శ్రీమతి పుష్పలత గారు, అంగనవాడి సిబ్బంది శ్రీమతి రామసీత గారు, శ్రీ ఛాయకుమారి గారు, శ్రీ జయమ్మ గారు, శ్రీ దుర్గ గారు, శ్రీ వెంకటలక్ష్మి గారు తదితరులు పాల్గొన్నారు.
Paper Clippings
For more details please visit http://www.uardt.org/coronavirus/